Wednesday, January 22, 2025

మోడీకి పాక్ ప్రధాని అభినందనలు

- Advertisement -
- Advertisement -

వరుసగా మూడవ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీకి పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ సోమవారం అభినందనలు తెలియజేశారు. ‘భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నరేంద్ర మోడీకి అభినందనలు’ అని షరీఫ్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ శనివారం అనిశ్చిత ప్రకటన నేపథ్యంలో ఈ అభినందన సందేశం వచ్చింది. ప్రధాని మోడీని అభినందిస్తున్నారా అన్న ప్రశ్నకు బలోచ్ ‘వారి ఎన్నికల ప్రక్రియపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయడం లేదు’ అని సమాధానం ఇచ్చారు.

కొత్త భారత ప్రభుత్వం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనందున అభినందన సందేశాలపై చర్చించడం ‘తొందరపాటు’ అవుతుందని ఆమె అన్నారు. ‘భారత్‌తో సహా తన పొరుగు దేశాలతో సహకార సంబంధాలను పాకిస్తాన్ ఎల్లప్పుడూ వాంఛిస్తుంటుంది.జమ్మూ కాశ్మీర్ ప్రధాన వివాదంతో సహా అన్ని పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక చర్చలను మేము సూచిస్తూనే ఉన్నాం’ అని బలోచ్ తెలిపారు. పాకిస్తాన్‌తో సుహృద్భావపూర్వక సంబంధాలను తాము కోరుకుంటున్నామని భారత్ స్పష్టం చేస్తున్నది. అటువంటి చర్చల కోసం పాకిస్తాన్ ముందుగా ఉగ్రవాద, విరోధ రహిత వాతావరణాన్ని సృష్టించాలని కూడా భారత్ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News