Friday, January 17, 2025

కర్నాటక విధాన సౌధలో పాకిస్థాన్ నినాదాలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటక విధాన సౌధలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు వెలువడటం వివాదాస్పదం అయింది. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం తీవ్రస్థాయిలో స్పందించారు. దీనిని సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఈ అభ్యంతకర నినాదాలు వెలువడినట్లు రుజువు అయితే సంబంధితులపై తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాజ్యసభ ఎన్నికలలో సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలుపు సందర్భంగా మంగళవారం రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలకు దిగారు. ఈ దశలో కొందరు పాకిస్థాన్ అనుకూల నినాదాలకు దిగారని వార్తలు వెలువడ్డాయి. దీనిపై బిజెపి ఇతర పక్షాల నుంచి తీవ్ర నిరసనలకు దారితీసింది. ఘటనపై బిజెపి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలోని బెల్గావి, చిత్రదుర్గ, మాండ్య ఇతర ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలకు దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మితిమీరిందని బిజెపి నేతలు మండిపడ్డారు. బిజెపి విమర్శలపై సిఎం సిద్ధరామయ్య పెద్దగా స్పందించలేదు.

అయితే విషయాన్ని పరిశీలిస్తున్నాం ఎవరినీ వదిలేదన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలపై ప్రేక్షక పాత్ర ఉండదని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ పరీక్షలు చేపట్టారని తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌కు వాయిస్ రిపోర్టును పంపించామని వివరించారు. ఇక ఈ నినాదాల వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ హెచ్చరించారు. ఇటువంటి పిచ్చి కూతలకు దిగిన వారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయకపోతే దేశ వ్యాప్త ఉద్యమం సాగుతుందని జోషి తెలిపారు. ఈ విధంగా కాంగ్రెస్ నిజరూపం ప్రజలకు తెలుస్తుందన్నారు. కాగా రాజ్యసభ ఎంపిగా ఎన్నికైన నసీర్ హుస్సేన్ ఘటనను ఇప్పటికీ ఖండించలేదని, పైగా దుష్ప్రచారం సాగిస్తున్నారని స్పందించడం దారుణం అని తెలిపారు. కేంద్ర మంత్రి గురువారం ఉత్తర కర్నాటకలో విలేకరులతో మాట్లాడారు. హుస్సేన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే ఏకలవ్య శిష్యుడు అని, మరి ఈ నినాదాల వ్యవహారంపై ఖర్గే కానీ , రాహుల్ గాంధీ కానీ ఏమంటారని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి బిజెపి నడుం బిగిస్తుందని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News