Sunday, December 22, 2024

అమెరికా దౌత్యాధికారిని పిలిచి నిరసన తెలిపిన పాక్

- Advertisement -
- Advertisement -

Pak summons US diplomat
ఇస్లామాబాద్: అమెరికా దౌత్యాధికారిని సమ్మన్ చేసి పాకిస్థాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసిందని శుక్రవారం అక్కడి మీడియా కథనం.‘విదేశీ కుట్ర’ అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణను అమెరికా విదేశాంగ శాఖ గురువారం తిరస్కరించింది. జాతినుద్దేశించిన ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ ‘హెచ్చరిక లేఖ’ గురించి చర్చించారు. తనని తొలగించడానికి జరుగుతున్న విదేశీ కుట్ర అని పేర్కొన్నారు. తన స్వతంత్ర విదేశాంగ విధానం నచ్చనందునే తనపై కుట్ర జరుగుతోందన్నారు. హెచ్చరిక లేఖ వెనుక అమెరికా ఉందని, తాను నోరు జారడం వల్ల అది చోటుచేసుకుందని వివరించారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం కనుక విఫలమైతే అమెరికా దౌత్యాధికారి తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని విదేశాంగ కార్యాలయం పేర్కొంది. హెచ్చరిక లేఖకు సంబంధించిన అమెరికా దౌత్యాధికారిని పాక్ విదేశాంగ కార్యాలయంకు పిలిపించడం జరిగిందని ‘దున్యా న్యూస్’ పేర్కొంది. పాకిస్థాన్ జాతీయర భద్రత మండలి(ఎన్‌ఎస్‌సి) గురువారం నిర్ణయించాక ఈ చర్య చేపట్టారు. ‘పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు’ అని అమెరికా దౌత్యవేత్తకు తెలిపినట్లు నివేదిక. ఇదిలావుండగా పాకిస్థాన్‌లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై ఎలాంటి లేఖను పంపలేదని అమెరికా తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వెనుక తమ ప్రమేయం ఏమి లేదని కూడా అమెరికా ఖరాఖండిగా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News