Monday, November 25, 2024

ఐసిస్‌కెకు పాక్ అండదండ

- Advertisement -
- Advertisement -

Pakistan supports to ISIS-K

కూరగాయల బండ్లు, తలపాగాల్లో శక్తివంతమైన బాంబులు సరఫరా
కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద పేలుడులో వాడింది అదే

కాబూల్ : అప్ఘన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో శక్తివంతమైన ఐఇడి బాంబులను పేల్చిన ఘటనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ దాడికోసం 11 కేజీల ఆర్‌డిఎక్స్‌ను వినియోగించారని తెలుస్తోంది. ఐఎస్‌కె ఉగ్రవాదులు వినియోగించిన ఈ బాంబు పాక్‌లోని పెషావర్, క్వెట్టా నగరాల నుంచి సరఫరా అయినట్టు తెలుస్తోంది. ఐసిస్ వినియోగిస్తున్న ఆయుధాలు పాక్‌లో తయారవుతున్నాయని, ఐసిస్ కు పాక్ అన్నిరకాలుగా అండగా ఉంటోందని నివేదక పేర్కొన్నది. పాక్ నుంచి ఆయుధాలను, ఆర్‌డిఎక్స్‌ను తలపాగాలోనూ, కూరగాయల బండ్ల ద్వారా పాక్ బోర్డర్ దాటించి ఆఫ్ఘనిస్తాన్‌లోకి చేరవేస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అధునాత ఆయుధాలు, హెల్మెట్లు వంటివాటిని కూడా తునాతునకలు చేసేంతటి శక్తివంతమైన ఆర్‌డిఎక్స్‌ను బాంబు తయారీలో వినియోగించారని ఆఫ్ఘన్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ తన నివేదికలో పేర్కొన్నది. ఆఫ్ఘన్ ప్రభుత్వంలో కలిసి పనిచేసిన వారితో పాటుగా ఐసిస్ ఉగ్రవాదులను ఈ సంస్థ ఇంటర్యూ చేసింది. ఇక ఐసిస్‌కెలో 90 శాతం మంది పాకిస్తానీయులు, ఆఫ్ఘాన్లు ఉన్నట్టు నివేదకలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News