- Advertisement -
సుప్రీంకోర్టు ఆదేశాలు : పాక్ సుప్రీం
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీ రద్దు వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తమ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. జాతీయ అసెంబ్లీ సమావేశాల వివరాల పట్టిక (మినిట్స్)ను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ అసెంబ్లీ రద్దు, అవిశ్వాస తీర్మానం తిరస్కృతిని సవాలు చేస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసు విచారణ వేగం పుంజుకోలేదు. జాతీయ అసెంబ్లీలో పరిణామాలపై సుప్రీంకోర్టు సుమోటోగా కూడా స్పందించింది. సోమవారం కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్‌తో కూడిన ధర్మాసనం చేపట్టింది. బుధవారం మూడోరోజుల విచారణ జరిగింది అధికార పిటిఐ తరఫున నేతలు బాబర్ అవాన్ , దేశాధ్యక్షులు అల్వీ తరఫున అలీ జాఫర్ హాజరయ్యారు. తమ వాదనలు విన్పించారు.
- Advertisement -