హైదరాబాద్: వరల్డ్ కప్‌లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో శ్రీలంక-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లంక 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. పాక్ ముందు 345 పరుగుల లక్ష్యాన్ని లంక ఉంచింది. కుశాల్ మెండీస్, సదీరా సమర విక్రమ్ సెంచరీలతో చెలరేగారు. పథుమ్ నిశాంక హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. మెండీస్ 77 బంతుల్లో 122 పరుగులు చేసి హసన్ అలీ బౌలింగ్‌లో ఇమామ్ అల్ హక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
విక్రమ్ 89 బంతుల్లో108 పరుగులు చేసి హసన్ అలీ బౌలింగ్ రిజ్వాన్ కు క్యాచ్ ఔటయ్యాడు. కుశాల్ పెరీరా పరుగులేమీ చేయకుండా హసన్ అలీ బౌలింగ్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో మైదానం వీడాడు. నిశాంక 51 పరుగులు చేసి షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో షఫికు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. చరితా అశలంకా ఒక పరుగు చేసి హసన్ బౌలింగ్‌లో రిజ్వాన్ క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. ధనుంజయ్ ది సిల్వా 25 పరుగులు చేసి మహ్మాద్ నవాజ్ బౌలింగ్‌లో షహీన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. దసున్ శనకా 12 పరుగులు చేసి షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో బాబర్ అజమ్‌కు క్యాచ్ వికెట్ సమర్పించుకున్నాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ నాలుగు వికెట్లు, హరిష్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా అఫ్రిది, నవాజ్, షాదాబ్ ఖాన్ తలో ఒక వికెట్ తీశారు.