ఆస్ట్రేలియా: పెర్త్ స్టేడియంలో పాకిస్తాన్-జింబాబ్వే మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 131 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. షీన్ విలియమ్సన్ 31 పరుగులు చేసి షాదాబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. బ్రాడ్ ఇవాన్స్ 19 పరుగులు చేసి మహ్మాద్ వసీమ్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. వాస్లే మదేవర్ 17 పరుగులు చేసి మహ్మాద్ వాసిమ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. క్రైగ్ ఎర్విన్ 19 పరుగులు చేసి హరిస్ రౌఫ్ బౌలింగ్‌లో మహ్మాద్ వాసిమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మిల్టన్ శుంబా ఎనిమిది పరుగులు చేసి షాదాబ్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రగిస్ చకబ్వా పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యాడు. సికిందర్ రాజా(09) పరుగులు చేసి మహ్మాద్ వాసిమ్ బౌలింగ్‌లో హరీష్ రౌఫ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లుకే జోంగ్వే పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యాడు. రీన్ బర్ల్ (10 నాటౌట్), రిచర్డ్ గరావా(03 నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో వషీమ్ నాలుగు వికెట్లు పడగొట్టగా షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు, హరీష్ రౌఫ్ ఒక వికెట్ తీశాడు.
పాకిస్తాన్ లక్ష్యం 131
- Advertisement -
- Advertisement -
- Advertisement -