పాకిస్థాన్ అధికారులు కరాచీలోని మలిర్ జైలు నుంచి 22 మంది భారతీయ మత్సకారులను విడుదల చేశారు. కాగా వారిని శనివారం భారత్‌కు అప్పగించనున్నారని మీడియా రిపోర్టు. ఈ విషయాన్ని మలిర్ జైలు సూపరింటెండెంట్ అర్షద్ షా తెలిపినట్లు ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ వార్తా పత్రిక పేర్కొంది. ఆ మత్యకారులను లాహోర్‌కు ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఈది ఫౌండేషన్ ఛైర్మన్ ఫైసల్ ఈది ఏర్పాట్లు చేశారని సమాచారం. అనుకోకుండా విదేశీ జలాల్లోకి ప్రవేశించే మతకారుల విషయంలో కాస్త కరుణతో వ్యవహరించాలని ఇరు దేశాలను ఈది కోరారు. వారిని దీర్ఘకాలం బంధించి ఉంచితే వారి కుటుంబ సభ్యులు చాలా బాధలకు గురవుతారని వెల్లడించారు.
పాకిస్థాన్, ఇండియా అధికారులు బందీలను సాధారణంగా వాగా సరిహద్దు వద్ద విడిచిపెడుతుంటారు. ఈ రెండు దేశాలు తరచూ మత్సకారులను తమ దేశ జలాల్లోకి ప్రవేశించినందుకు అదుపులోకి తీసుకుంటాయి. రెండు దేశాలు మార్పిడి చేసుకున్న ఖైదీల జాబితా ప్రకారం జనవరి 1 నాటికి పాకిస్థాన్‌లో 266 మంది భారతీయ ఖైదీలున్నారు. వారిలో 49 మంది సివిలియన్లు కాగా, 217 మంది మతకారులు. కాగా ఇండియా జైళ్లలో మొత్తం 462 మంది పాకిస్థానీలున్నారు. వారిలో 381 మంది సివిలియన్ ఖైదీలు, 81 మంది మత్సకారులు.