Wednesday, January 22, 2025

చైనా ప్రభావిత దేశాల్లో పాకిస్థాన్ టాప్!

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: చైనా ప్రభావిత దేశాల్లో పాకిస్థాన్ అగ్రగామిగా ఉందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ‘బీజింగ్స్ ఎక్స్‌పాండింగ్ గ్లోబల్ స్వే’ పేరిట ఆ అధ్యయనం చైనా విస్తరణను అధ్యయనం చేసింది. చైనా ఇండెక్స్ — తైవాన్ ఆధారిత పరిశోధనా సంస్థ ‘డబుల్ థింక్ ల్యాబ్స్’ ద్వారా పునఃప్రారంభించబడిన డేటాబేస్ — ప్రపంచంలోని 82 ఇతర దేశాల జాబితాలో పాకిస్తాన్‌ను అగ్రస్థానంలో ఉంచింది, చైనాకు బాగా ప్రభావితం అయిన ప్రపంచ దేశాలలో పాకిస్థాన్ టాప్‌లో ఉన్నట్లు తైవాన్‌కు చెందిన ఆ పరిశోధన సంస్థ పేర్కొంది. విదేశాంగ విధానం, దేశీయ విధానం, టెక్నాలజీ, ఆర్థిక విధానాలలో పాకిస్థాన్ బీజింగ్‌పై బాగా ఆధారపడి ఉందని ఆర్‌ఎఫ్‌ఈ/ఆర్‌ఎల్ అధ్యయనం పేర్కొంది.

చైనా ప్రభావానికిలోనై ఉన్న దేశాలలో పాకిస్థాన్ తర్వాత ఆగ్నేయ ఆసియా దేశాలు, కంబోడియా, సింగపూర్, థాయ్‌లాండ్ ఉన్నాయి. ఏడవ స్థానంలో ఫిలిప్పీన్స్, 10వ స్థానంలో మలేషియా ఉన్నాయి. 5వ స్థానంలో దక్షిణాఫ్రికా ఉంది. పెరూ తో చైనా సంబంధాలు కలిగి ఉంది. చైనాకు చెందిన పశ్చిమ జిన్‌జియాంగ్ ప్రాంతంతో సరిహద్దు కలిగి ఉన్న కిర్గిజ్‌స్థాన్, తజకిస్థాన్ బాగా ప్రభావితమైన మధ్య ఆసియా దేశాలు. అవి ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో ఉన్నాయి. చైనా ప్రభావిత యూరొప్ దేశాల్లో జర్మనీ 19వ స్థానంలో, ఉత్తర అమెరికా 21వ స్థానంలో ఉన్నాయి.

ఈ చైనా ఇండెక్స్‌ను రూపొందించేప్పుడు పరిశోధక బృందం ఉన్నత విద్య, దేశీయ రాజకీయాలు, ఆర్థిక సంబంధాలు, విదేశాంగ విధానం, చట్టం అమలు, మీడియా, మిలిటరీ సహకారం, సాంస్కృతిక సంబంధాలు, సాంకేతికత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News