Wednesday, January 22, 2025

పిఒకెలో మరిన్ని పాక్ టవర్స్

- Advertisement -
- Advertisement -

ఉగ్ర చొరబాట్లకు బాజాప్త చేయూత
జమ్మూ : ఆక్రమిత కశ్మీర్(పిఒకె) లో పాకిస్థాన్ తన టెలికం టవర్స్ సంఖ్యను పెంచింది. ఎల్‌ఒసి వెంబడి పాకిస్థాన్ చేపట్టిన ఈ చర్య కేవలం ఉగ్రవాదులకు ఊతం ఇచ్చేందుకు, వారు చొరబాట్లకు దిగేందుకు అని భారత అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. ఉగ్రవాద సంస్థలు తమ చర్యలకు అత్యంత సమర్థవంతం అయిన ఎస్‌ఎంఎస్ సేవలను వాడుకుంటున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సమాచార పంపిణీకి , ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్లు, రేడియో సమాచార వ్యవస్థలతో అనుసంధానం అయ్యేందుకు ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి. ఈ సేవల టర్మినల్స్ ఏర్పాటు ఇటీవలి కాలంలో ఇక్కడ ఎక్కువైంది. ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలలో చొరబాట్లు, ఉగ్రవాద చర్యలను పరిశీలిస్తే టవర్స్ ఏర్పాటు ఎక్కువైందనే విషయాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేకించి జమ్మూ ప్రాంతంలోని పిర్ పంజాల్ రేంజ్‌కు దక్షణంలో ఈ చొరబాట్లు, ఉగ్రవాద కదలికలు ఎక్కువయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News