- Advertisement -
శ్రీనగర్: కాశ్మీర్ లో మరోసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడంది. వరుసగా నాలుగో రోజు నియంత్రణ రేఖ(LOC) వెంబడి పాక్ సైనికులు కాల్పులు జరిపినట్లు భారత ఆర్మీ తెలిపింది. కుప్వారా, పూంఛ్ జిల్లాల సరిహద్దుల్లో స్వల్ప స్థాయిలో పాక్ కాల్పులకు పాల్పడిందని పేర్కొంది. అయితే, అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ.. పాక్ కాల్పులను తిప్పి కొట్టినట్లు ఓ అధికారి వెల్లడించారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వారిని ఎక్కడ ఉన్నా.. వారి వెనుక ఎవరున్నా వదిలిపెట్టమని..ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని భారత ప్రధాని మోడీ హెచ్చరించడంతో.. అప్రమత్తమైన పాక్ భారీగా తన సైన్యాన్ని సరిహద్దుకు తరలించింది. యుద్ధ విమానాలను కూడా తరలిస్తోంది.
- Advertisement -