Thursday, April 24, 2025

పాకిస్థానీలకు వీసాల తక్షణ రద్దు

- Advertisement -
- Advertisement -

పహల్గామ్ నేపథ్యంలో భారత్ చర్య

న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం తక్షణ చర్యలలో భాగంగా పాకిస్థానీ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. పాకిస్థాన్‌లో ఉంటున్న భారతీయులంతా అందుబాటులో ఉన్న రవాణా ఏర్పాట్ల ద్వారా స్వదేశానికి వచ్చేయాలని తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ పూర్తి స్థాయి సమీక్షలో ఈ వీసా రద్దు నిర్ణయం కూడా ఒక్కటి. పాకిస్థానీయులకు ఇప్పటివరకూ ఉన్న వీసాల ప్రక్రియను శాశ్వత రీతిలో రదుద చేసినట్లుగా భావించుకోవల్సి ఉంటుందని విదేశాంగ మంత్రిత్వవాఖ తమ ప్రకటనలో తెలిపింది. ఇక వైద్య చికిత్సలకు భారతదేశాని రావాలనుకనే వారికి జారీ చేసే ప్రత్యేక తరహా మెడికల్ వీసాలు ఆ నెలాఖరు వరకూ చెల్లుతాయి. భారతీయ పౌరులు ఎవరు కూడా పాకిస్థాన్‌లో పర్యటించరాదు. వివిధ కారణాలతో పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయులు ఏదో విధంగా వెంటనే తిరిగి రావాల్సి ఉందని కూడా స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News