పాకిస్థాన్ 448/6 డిక్లేర్డ్, బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు
రావల్పిండి: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును సాధించింది. గురువారం రెండో రోజు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టాని కి 448 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. సౌద్ షకి ల్, మహ్మద్ రిజ్వాన్‌లు అద్భుత శతకాలతో పా కిస్థాన్‌ను ఆదుకున్నారు. ఒక దశలో 114 పరు గులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పాక్ ఇన్నిం గ్స్‌ను వీరిద్దరూ పటిష్టపరిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన షకిల్ 261 బంతుల్లో 9 ఫోర్లతో 141 ప రుగులు చేశాడు. మరోవైపు వికెట్ కీపర్ రిజ్వా న్ కూడా అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇటు షకిల్ అటు రిజ్వాన్ సమన్వయంతో ఆ డుతూ పాక్‌ను కష్టాల్లో నుంచి గట్టెక్కించారు. ధాటిగా ఆడిన రిజ్వాన్ 239 బంతుల్లో 11 ఫో ర్లు, 3 సిక్సర్లతో 171 పరుగులు చేసి అజే యంగా నిలిచాడు. షాహిన్ అఫ్రిది 29 (నాటౌ ట్) తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయా నికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసిం ది. అయితే పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అం దుకోవాలంటే బంగ్లాదేశ్ మరో 421 పరుగులు చేయాలి.