Sunday, December 22, 2024

ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఆస్ట్రేలియా 35 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. స్టీవ్ స్మిత్ (35) ఒక్కడే కాస్త రాణించాడు. ఓపెనర్లు మాథ్యూ షార్ట్ (19), మెక్‌గుర్క్ (13) శుభారంభం అందించలేక పోయారు. జోన్ ఇంగ్లిస్ (18), లబుషేన్ (6), అరోన్ హార్డి (14), మాక్స్‌వెల్ (16) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయారు. ప్రత్యర్థి టీమ్ బౌలర్లలో హారిస్ రవూఫ్ అద్భుతంగా రాణించాడు. షహీన్ అఫ్రిది కూడా మెరుగైన బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. రవూఫ్ 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

షహీన్‌కు మూడు వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 26.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫిక్ జట్టుకు శుభారంభం అందించారు. చెలరేగి ఆడిన సైమ్ 71 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 82 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. అబ్దుల్లా షఫిక్ 3 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 64 పరుగులు సాధించాడు. బాబర్ ఆజమ్ 20 (నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. దీంతో పాక్ అలవోక విజయంతో సిరీస్‌ను 11తో సమం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News