ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో ట్వంటీ20లోనూ పాకిస్థాన్ విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ 30తో క్లీన్‌స్వీప్ చేసింది. చివరి మ్యాచ్‌లో కూడా బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఓపెనర్ నయీం రెండు సిక్సర్లు, 2 ఫోర్లతో 47 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒక షమీమ్ హుస్సేన్ (22), అఫిఫ్ హుస్సేన్ (20) తప్ప మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. పాక్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఇఫ్తికార్, మహ్మద్ వసీం జూనియర్ అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను డిఫెన్స్‌కే పరిమితం చేశారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (40), కెప్టెన్ బాబర్ ఆజమ్ (19) పరుగులు చేశారు. మరోవైపు బంగ్లా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ప్రతి పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే హైదరాబాద్ అలీ రెండు సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 45 పరుగులు చేసి పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.