Thursday, November 21, 2024

సిరీస్ పాకిస్థాన్‌దే!

- Advertisement -
- Advertisement -

చివరి వన్డేలో ఆసీస్ చిత్తు
2-1తో సిరీస్ పాక్ వశం

పెర్త్: ఇటీవల పాకిస్థాన్ టీమ్ సంచలనాలు నమోదు చేస్తోంది. స్వదేశంలో ఇంగ్లండ్ వంటి టీమ్‌లపై సిరీస్ గెలిచిన పాక్ ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో సొంతం చేసుకుంది. తొలి వన్డేలో ఘోరపరాజయం పాలైనా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మిగతా రెండు వన్డేల్లో ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం చివరి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. 22 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియా గడ్డపై పాక్ వన్డే సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.

అంతకుముందు చివరిసారిగా 2002లో పాకిస్థాన్ వన్డే సిరీస్ నెగ్గింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 31.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. అబాట్ (30) ఒక్కడే ఆసీస్ బ్యాటర్లలో టాప్ స్కోరర్. అబాట్‌తో పాటు మాథ్యూ షార్ట్ (22) మినహా ఎవరూ 20 పరుగుల మార్క్‌ను దాటలేదు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, నసీమ్ షా చెరో మూడు వికెట్లు, హారిష్ రవూఫ్ రెండు, హస్త్రన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష ఛేదనకు దిగిన పాక్.. 26.5 ఓవర్లలోనే మ్యాచ్ పూర్తి చేసింది. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సయిమ్ అయుబ్ (42), అబ్దుల్లా షఫికి (37), మహ్మద్ రిజ్వాన్ (30), బాబర్ అజామ్ (28 నాటౌట్) పరుగులు చేశారు. లాన్స్ మోరీస్ రెండు వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News