జమైకా: వెస్టిండీస్‌తో జరిగిన రెండో, చివరి టెస్టులో పాకిస్థాన్ 109 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. 329 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన విండీస్‌ను పాకిస్థాన్ బౌలర్లు 219 పరుగులకే కట్టడి చేశారు. విండీస్ బ్యాట్స్‌మెన్‌లు మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. పాక్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లను తీస్తూ విండీస్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్(39), ఓపెనర్ కీరన్ పొవెల్(23), జర్మయిన్ బ్లాక్‌వుడ్(25), కీల్ మేయర్స్(32) పాకిస్థాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును కష్టాల్లో నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నించారు.
అంతేగాక మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 47 పరుగులు చేసినా జట్టును ఓటమి నుంచి కాపాడలేక పోయాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది నాలుగు, నౌమన్ అలీ మూడు, హసన్ అలీ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 302, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో షాహిన్ అఫ్రిది ఏకంగా పది వికెట్లను పడగొట్టాడు. అతనికే మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డులు లభించాయి. ఇక, తొలి టెస్టులో వెస్టిండీస్ ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించింది.
Pakistan won by 109 runs against West Indies