Thursday, January 23, 2025

పాకిస్థాన్ ఇన్నింగ్స్ విజయం

- Advertisement -
- Advertisement -

లంకపై టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్
కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో, చివరి టెస్టులో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 20తో క్లీన్ స్వీప్ చేసింది. గురువారం నాలుగో రోజు ఆతిథ్య శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ బౌలర్లు నొమాన్ అలీ, నసీమ్ షాలు అద్భు త బౌలింగ్‌తో లంక ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌తో చేపట్టిన లంకకు ఓపెనర్లు నిశాన్ మదు ష్కా, దిముత్ కరుణరత్నెలు శుభారంభం అందించారు. ఇద్దరు పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కుదురుగా ఆడిన నిశాన్ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు.

మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కరుణరత్నె 41 పరుగులు సాధించాడు. అయితే సాఫీగా సాగుతున్న లంక ఇన్నింగ్స్‌ను నొమాన్ అలీ దెబ్బతీశారు. అతను ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి లంకను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. నొమాన్ ఏడు వికెట్లు తీశాడు. ఇక నసీమ్‌షాకు మూడు వికెట్లు దక్కాయి. లంక టీమ్‌లో ఎంజిలో మాథ్యూస్ 63 (నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అంతకుముందు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 576 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. ఓపెనర్ షఫిక్ (201), ఆఘా సల్మాన్ 132 (నాటౌట్), రిజ్వాన్ 50 (నాటౌట్), మసూద్ (51), సౌద్ షకిల్ (57)లు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. కాగా లంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News