- Advertisement -
దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో అతి పెద్ద సమరానికి సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా పాక్ కెప్టెన్ రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘మా ఆటగాళ్లకి ఈ పరిస్థితుల్లో ఆడటం అలవాటు. ముందు బ్యాటింగ్ ప్రత్యర్థి ముందు బలమైన టార్గెట్‌ని ఉంచుతాం’ అని అన్నాడు. ఆ తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. ‘ఇది కూడా గత మ్యాచ్‌లానే అనిపిస్తుంది. మా వద్ద అనుభవమున్న బ్యాటింగ్ ఉంది. స్లో పిచ్‌లపై ఎలా ఆడాలో మాకు తెలుసు’ అని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫకార్ జమాన్ స్థానంలో ఇమామ్-ఉల్-హక్‌ని జట్టులోకి తీసుకొగా.. భారత అదే జట్టుతో బరిలోకి దిగుతోంది.
- Advertisement -