ఆసియా కప్ 2023 ఓటమి నుంచి ఇంకా కోలుకోని పాకిస్థాన్ జట్టుకు మరో షాక్ తగిలింది. పాకిస్తాన్ పేస్ ఒకరైన యువ పేసర్ నసీమ్ షా గాయం కారణంగా మొత్తం ప్రపంచ కప్ 2023 నుండి వైదొలిగాడు. అతని స్థానంలో సెలక్టర్లు హసన్ అలీని 15 మందితో కూడిన జట్టులోకి ఎంపిక చేశారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) శుక్రవారం వెల్లడించింది.
ఆసియా కప్‌లో గాయపడిన నసీమ్ షాకు వైద్య పరీక్షలు నిర్వహించాం. వైద్యుల సూచన మేరకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. మరో మూడు నాలుగు నెలల్లో నసీమ్ కోలుకునే అవకాశం ఉంది’ అని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆసియాకప్‌లో సెప్టెంబర్ 11న భారత జట్టుతో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో నసీమ్ గాయపడిన సంగతి తెలిసిందే.
హసన్ అలీ, నసీమ్ షా
భారత ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో నొప్పి కారణంగా మైదానం వీడిన నాసిమ్ ఆ తర్వాత బ్యాటింగ్‌కు కూడా రాలేదు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నసీమ్ షాకు బదులుగా పేసర్ జమాన్ ఖాన్ ఆడాడు. అనంతరం దుబాయ్‌లో నసీమ్‌కు స్కానింగ్ నిర్వహించారు. అతడి భుజానికి గాయం గతంలో కంటే ఎక్కువైన సంగతి తెలిసిందే. దీంతో ఈ యువ పేసర్ ప్రపంచకప్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్, పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024కి అందుబాటులో ఉండడని పిసిబి వెల్లడించింది.
న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్
హసన్ అలీ 2017లో పాకిస్థాన్ తరఫున తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు 60 వన్డేలు ఆడిన అలీ 30.36 సగటుతో 91 వికెట్లు తీశాడు. అలీ తన చివరి మ్యాచ్‌ని ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో ఆడాడు. అక్టోబర్ 5న భారత్‌లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అంతకు ముందు సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.