Monday, December 23, 2024

పాక్ బ్యూటీ నటి డేటింగ్ ఆఫర్..

- Advertisement -
- Advertisement -

కరాచీ : బంగ్లాదేశ్ టీం గనుక వరల్డ్ కప్ క్రికెట్‌లో భారత్‌ జట్టును చిత్తు చేస్తే డేటింగ్ చేస్తానని పాకిస్థాన్‌కు చెందిన అందాలనటి సెహర్ షిన్వారీ తెలిపింది.ఈ మేరకు ఎక్స్ వేదిక ద్వారా ఆఫర్ వెలువరించింది. భారత్ జట్టును ఓడిస్తే తాను ఢాకాకు వెళ్లి బంగ్లా టీంలోని ఆటగాడితో గడుపుతానని ఇందులో తెలిపింది. గత శనివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టును ఇండియా జట్టు మట్టికరిపించింది. దీనిని చూసి తట్టుకోలేక ఈ పాక్ బ్యూటీ ఈ విధంగా స్పందించింది. తమ బంగ్లాబంధు టీం ఇండియా జట్టును ఓడించాలి. ఓడిస్తే తానే చెప్పింది చేస్తానని పేర్కొంది. గురువారం భారత్ బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సమరం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో బంగ్లా జట్టు భారత్‌చేతిలో ఘోరంగా ఓడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News