Wednesday, January 15, 2025

ఇంకా సింగిల్ గానే ఎందుకున్నానంటే… : యుమ్నా జైదీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మన నటి టబు మాదిరి పాకిస్థానీ నటి యుమ్నా జైదీ కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇంకా సింగిల్ గానే జీవితం గడుపుతోంది. ఎంటర్ టైన్ మెంట్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని కూడా ఆర్జించింది. ఆమె నటించిన టివి సీరియల్ ‘తేరే బిన్’ బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం ఆమె సహ నటుడు వహజ్ అలీతో అమెరికాలోని డల్లాస్ లో ఉంది. అక్కడ ‘తేరే బిన్’ ఫ్యాన్స్ ను అలరిస్తోంది.

ఫ్యాన్స్ తో పిచ్చాపాటి చర్చల సందర్భంగా ఆమె తన పెళ్లి కాకపోవడం గురించి కూడా చర్చించింది. ‘‘ నేను చాలా మొండి ఘటాన్ని. అందుకే సింగిల్ గా ఉన్నాను. అలా ఎందుకనేది నాకే తెలియదు. నేను సింగిల్ గా ఉండడాన్ని ఇష్టపడుతున్నాను కూడా’’ అని వివరించింది.

‘తేరే బిన్’ సీరియల్ కంటే ముందు ఆమె మేరీ దులారీ, దిల్ ముహల్లే కీ హవేలీ, రిస్తే కుచ్ అధూరే సే, దిల్ నా ఉమీద్ తో నహీ, ప్యార్ కే సద్ఖే, పరిజాద్, బఖ్తవర్ వంటి అనేక సీరియల్స్ లో నటించి అలరించింది. ప్రస్తుతం ఆమె గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్ డ్రామా సీరియల్ లో నటిస్తోంది.

Yumna Zaidi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News