Sunday, December 22, 2024

ఇటలీలో దొంగతనం చేసిన పాకిస్తానీ బాక్సర్

- Advertisement -
- Advertisement -

పరాయి దేశంలో దొంగతనం చేసి స్వదేశం పరువు తీశాడు పాకిస్తానీ బాక్సర్ జోహైబ్ రషీద్. ఒలింపిక్స్ అర్హత పోటీల్లో పాల్గొనేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన పాకిస్తానీ బాక్సింగ్ బృందం ఇటీవల ఇటలీ వెళ్లింది. అందులో రషీద్ కూడా ఉన్నాడు.

ఒక రోజు శిక్షణలో భాగంగా లారా ఇక్రమ్ అనే మహిళా బాక్సర్ స్టేడియంకి వెళ్లగా, రషీద్ హోటల్లోని ఆమె గదిలోకి వెళ్ళి,  బ్యాగ్ లోంచి విదేశీ కరెన్సీ ఉన్న పర్సును కొట్టేసి పారిపోయాడు. దీంతో పరాయి దేశంలో తమ పరువు తీశాడంటూ పాకిస్తాన్ బాక్సింగ్ ఫెడరేషన్ అధికారులు రషీద్ పై మండిపడుతున్నారు. దీనిపై ఇటలీలోని రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News