Monday, December 23, 2024

భారత్ లోకి చొరబాటుకు యత్నం.. పాక్ పౌరుడి హతం

- Advertisement -
- Advertisement -

Pakistani civilian attempting to cross border in Rajasthan

జైపూర్ : భారత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన పాకిస్థాన్ పౌరుడిని సరిహద్దు భద్రతాదళం సిబ్బంది హతమార్చారు. రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ జిల్లా అనూప్‌గఢ్ సెక్టార్‌లో ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పాకిస్థాన్ పౌరుడొకరు భారత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా బీఎస్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై హెచ్చరికలు చేశారు. అయినా ఖాతరు చేయకపోవడంతో కాల్పులు ప్రారంభించినట్టు శ్రీగంగాపూర్ ఎస్పీ ఆనంద్ శర్మ తెలిపారు. మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేనందున గుర్తించడం కష్టమవుతోందని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News