క్రికెట్ ఆడుతున్న సమయంలో మైదానంలో కుప్పకూలి ఓ పాకిస్థాన్‌కు చెందిన క్రికెటర్ ప్రాణాలు వదిలిన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఎండ తీవ్రతను తట్టుకోలేకే జరిగిన దురదృష్ట ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌కు 40 ఏళ్ల జాఫర్ ఖాన్‌కు క్రికెట్ మీద మక్కువ ఎక్కువ. 2013 వరకూ పాకిస్థాన్‌లో ఉన్న అతను ఆ తర్వాత ఐటి రంగంలో ఉద్యోగం కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అడిలైడ్‌లో ఉద్యోగం చేస్తూనే క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఆడుతుండేవాడు. వయస్సును కూడా లెక్క చేయకుండా క్రికెట్ మ్యాచ్‌ల్లో పాల్గొనేవాడు.
క్లబ్ స్థాయిలో ఓల్డ్ కాంకొర్డియన్స్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత శనివారం జరిగిన ప్రిన్స్ అల్‌ఫ్రెడ్ ఓల్డ్ కాలేజియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను పాల్గొన్నాడు. 40 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన అతను 7 ఓవర్లు బ్యాటింగ్ కూడా చేశాడు. అయితే 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను కుప్పకూలిపోయాడు. అతడికి చికిత్స అందించేందుకు వైద్య బృందాలు ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై ఓల్డ్ కాంకొర్డియన్స్ క్రికెట్ క్లబ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తమ క్లబ్‌కి చెందిన ఆటగాడు మైదానంలో ప్రాణాలు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నట్లు వెల్లడించింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.