Wednesday, January 22, 2025

కోల్‌కతా యువకుడిని పెళ్లి చేసుకోడానికి వచ్చిన పాక్ యువతి

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : కోల్‌కతాకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకోడానికి పాకిస్థాన్‌కు చెందిన యువతి మంగళవారం భారత్‌కు వచ్చింది. కోల్‌కతాకు చెందిన సమీర్ ఖాన్‌ను కరాచీకి చెందిన యువతి జవేరియా ఖానుమ్ వచ్చే ఏడాది జనవరిలో వివాహం చేసుకోబోతోంది. జవేరియా మంగళవారం అమృత్‌సర్ జిల్లా లోని వాఘా అట్టారీ అంతర్జాతీయ సరిహద్దు నుండి భారత దేశానికి చేరుకుంది.

కాబోయే భర్త సమీర్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు.
గతంలో ఖానుమ్‌కు రెండు సార్లు వీసా ఇచ్చేందుకు భారత్ కొవిడ్ కారణంగా తిరస్కరించింది. దాదాపు ఐదేళ్ల పాటు వీరి వివాహానికి కొవిడ్ వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు 45 రోజుల వీసా మంజూరైంది. “ 45 రోజుల వీసా మంజూరు కావడంతో ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నాకు చాలా ప్రేమ లభించింది. జనవరి మొదటి వారంలో తమ వివాహం జరుగుతుంది ” అని జవేరియా తన ఆనందాన్ని పంచుకుంది. తామిరువురం ఎలా పరిచయమయ్యామో సమీర్ ఖాన్ వివరించారు.

తన తల్లి ఫోన్‌లో ఖానుమ్ ఫోటో చూసిన తరువాత ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్టు సమీర్ ఖాన్ వెల్లడించారు. 2018 మే లో తమ పరిచయం ప్రారంభమైందన్నారు. జర్మనీలో చదువుకుంటున్న సమయంలో తానింటికి వచ్చానని, ఆ సమయం లోనే జవేరియా ఫోటో తన కంటపడిందని సమీర్ ఖాన్ చెప్పారు. వీసా మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ పెళ్లికి జర్మనీ, ఆఫ్రికా, స్పెయిన్, అమెరికా తదితర దేశాల నుంచి తన స్నేహితులు వస్తారని ఖాన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News