Sunday, December 22, 2024

శ్రీమతికి బహుమతిగా గాడిద(వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: జంతు ప్రేమికులైన వారిద్దరి మనసులు, అభిరుచులు కలిశాయి. పెళ్లి మండపంలో తనకు కాబోయే భార్యకు పెళ్లికొడుకు కలలో కూడా ఎవరూ ఊహించని బహుమతి ఇచ్చి షాక్ ఇచ్చాడు. ఆ బహుమతి చూసి వధువు కూడా బిత్తరపోయింది. ఆ కథేంటో మీరూ ఓ లుక్కేయండి. పాకిస్తాన్‌కు చెందిన అహ్మద్ అస్లామ్ తన పెళ్లి సందర్భంగా తనలాగే పెంపుడు జంతువులంటే పడిచచ్చే వధువు వారిషాకు కుక్క పిల్లనో, పిల్లి పిల్లనో కాకుండా ఏకంగా గాడిద పిల్లనే బహుమతిగా ఇచ్చాడు.

బహుమితిని తీసుకురండి అంటూ పెళ్లి మండపంలో అసాం ఎవరికో చెప్పగా వయ్యారంగా నడుచుకుంటూ పిల్ల గాడిద అక్కడకు వచ్చింది. ఇదే నీకు నేనిచ్చే అపురూపమైన బహుమతి అంటూ గాడిద మెడలో కట్టిన బెల్టును అస్లాం చేతిలో పెట్టడంతో వారిషా కంగుతింది. తర్వాత తేరుకుని ఆ అపురూమైన బహుమతిని ప్రేమగా దగ్గరకు తీసుకుంది. ప్రపంచంలో అత్యంత కష్టపడే జంతువు గాడిదని, దీన్ని అందరూ ప్రేమిస్తారని, అందుకే తాను దీన్ని బహుమతిగా ఇస్తున్నానంటూ అస్లాం తన భార్యతోపాటు అక్కడున్న అందరికీ తన బహుమతిలోని అంతరార్థాన్ని వివరించాడు. ముద్దుగా ఉన్న ఆ గాడిద పిల్లను దత్తత తీసుకోవాలని ఆ కొత్త జంట నిర్ణయించుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News