Sunday, December 22, 2024

పాకిస్థానీ చొరబాటు దారుడి కాల్చివేత

- Advertisement -
- Advertisement -

జమ్ము : జమ్ము కశ్మీర్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం మట్టుబెట్టింది. హెచ్చరించినా ఆ వ్యక్తి దూసుకువస్తుండడంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరపవలసి వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో సాంబ సెక్టార్‌లో గురువారం ఈ సంఘటన జరిగింది.

అంతర్జాతీయ సరిహద్దు లోని బీఓపీ (బోర్డర్ అవుట్ పోస్ట్) మంగుచక్ వద్ద గురువారం తెల్లవారు జామున 2.50 గంటలకు పాకిస్థాన్ వైపు నుంచి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా దూసుకొస్తుండగా బీఎస్‌ఎఫ్ సిబ్బది గమనించింది. హెచ్చరించినా ఆ వ్యక్తి వినకుండా సరిహద్దు కంచె వైపు దూసుకొచ్చాడు. దీంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరపగా ఆ వ్యక్తి చనిపోయాడని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News