Wednesday, January 22, 2025

అవినీతి కేసు సాకు..జర్నలిస్టు జైలుపాలు

- Advertisement -
- Advertisement -

లాహోర్ : పాకిస్థాన్‌లో ప్రముఖ జర్నలిస్టు, టీవీ యాంకర్ ఇమ్రాన్ రియాజ్ ఖాన్‌ను శుక్రవారం అరెస్టు చేసి , జైలుకు పంపించారు. దేశ రాజకీయాలలో సైనిక అధికారుల పాత్ర కీలకమవుతోందని, ఇది దేశ పాలనను ప్రభావితం చేస్తోందని రియాజ్ ఖాన్ తరచూ తన రాతలతో స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై అవినీతి కేసు విచారణ చేపట్టారు. తరువాత ఇప్పుడు అరెస్టు జరిగింది. గత ఏడాది దేశంలో అసాధారణ రీతిలో సైనిక స్థావరాలపై దాడులకు సంబంధించి కూడా ఆయనను అదుపులోకి తీసుకుని నెలల తరబడి జైలులో ఉంచారు. ఇటీవలే జైలు నుంచి విడుదల అయిన ఆయనను ఇప్పుడు 14 రోజుల జుడిషియల్ కస్టడీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News