Thursday, January 23, 2025

భారత్ చంద్రయాన్‌పై పాక్ పత్రికల స్పందన

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : భారత్ పాకిస్థాన్‌లు ఈ మధ్యకాలంలో ఎడముఖం పెడముఖంగా ఉంటూ వస్తున్నాయి.ఈ దశలో చంద్రయాన్ విజయవంతంపై పాకిస్థాన్ పత్రికలు పతాకశీర్షికలలో వార్తలు వెలువడ్డాయి. ఇస్రోకు చంద్రయాన్ విజయం ఓ కీలకమైన మైలురాయి అని పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌధురి స్పందించారు. దేశంలోని పలు ప్రముఖ పత్రికలు, వెబ్‌సైట్లు దక్షిణ ధృవంపై భారతదేశ రాకెట్ దిగడాన్ని ప్రముఖంగా రాశాయి. జియోన్యూస్ తమ వెబ్‌డెస్క్‌లో దీనిపై ఓ కథనం వెలువరించింది.

ఈ ధృవంపై తొలిసారిగా అడుగిడిన దేశం భారత్ అని కొన్ని పత్రికలు పేర్కొన్నాయి. కాగా ద్వితీయ ప్రయత్నంలో ఇండియా గెలిచిందని కొన్ని వెబ్‌సైట్లు తెలిపాయి. ది న్యూస్ ఇంటర్నేషనల్, ది డాన్ పత్రిక, ది బిజినెస్ రికార్డర్, దున్యా న్యూస్ ఇతర వేదికలు చంద్రయాన్‌పై స్పందించాయి. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పిటిఐ తరఫున చంద్రయాన్ గెలుపు ఓ కీలక మలుపు అని తెలిపారు. ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాధ్ ఆధ్వర్యంలో దక్కిన విజయంతో యువతరం కలలు నెరవేరుతాయి. ప్రపంచ గమనాన్ని మారుస్తాయని ఫవాద్ స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News