Monday, January 20, 2025

ఇరాన్ క్షిపణి దాడిపై ముందుగానే పాక్‌కు తెలియజేశాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జనవరి 16 న ఇరాన్ క్షిపణి దాడి గురించి పాకిస్థాన్ మిలిటరీకి ముందుగానే తెలియజేసినట్టు ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది. అయితే అది బయటకు వెల్లడించడం గురించి పాకిస్థాన్‌కు ఎక్కడా చెప్పలేదని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్ ఉన్నత వర్గాలకు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్ (ఐఆర్‌జిసి ) కు అతి సన్నిహితంగా ఉండే టెలిగ్రామ్ ఛానెల్ జనవరి 18 న కథనం ప్రకారం పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలపై ఈ వారం చేపట్టిన దాడులకు పాకిస్థాన్ ప్రభుత్వంతో సమన్వయం అవసరమైందని వివరించింది. సరిహద్దుల్లో సుస్థిర భద్రత కోసం ఉగ్రవాద మూకల్ని నివారించాలని ఇరాన్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన ముందస్తు ఒప్పందం ప్రకారమే పాకిస్థాన్ కూడా దాడులు చేపట్టిందని ఆ కథనం పేర్కొంది. అఫ్గానిస్థాన్ లోని ఇరాన్ అధ్యక్ష రాయబారి హస్సన్ కజేమీ క్యోమి పాకిస్థాన్‌ను ఇటీవల సందర్శించడం ఇరాన్ చేపట్టనున్న దాడుల గురించి ముందుగా

పాక్‌కు తెలియజేయడానికే అన్న కొందరి జర్నలిస్టుల అభిప్రాయాలను కూడా పేర్కొంది. అయితే ఈ లోగా ఈ కథనాలను వ్యక్తిగతం పరిశీలించడం కాలేదు. రెండు దేశాలు దెబ్బకు దెబ్బ అన్న వ్యూహం తోనే దాడులు జరిపాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య అక్టోబర్ 7 న యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇరాన్ , పాకిస్థాన్ ఈ రెండు దేశాల సరిహద్దుల్లో చొరబాట్లు ముమ్మరమయ్యాయి. ఇరాన్‌పాకిస్థాన్ మధ్య సంబంధాలు జటిలంగా ఉన్నప్పటికీ, రెండు వైపులా ఉద్రిక్తతలను తగ్గించుకోవాలన్న సంకేతాలు ఇచ్చుకున్నాయి. గురువారం తమ సరిహద్దు గ్రామాల్లో పాక్ దాడుల వల్ల నలుగురు చిన్నారులతోసహా 9 మంది చనిపోయారని, ఇరాన్ వెల్లడించగా, మంగళవారం ఇరాన్ దాడుల వల్ల తమ భూభాగంలో ఇద్దరు పసివాళ్లు ప్రాణాలు కోల్పోయారని పాకిస్థాన్ పేర్కొంది. వేర్పాటువాద బెలోచ్ లిబిరేషన్ ఫ్రంట్, బెలోచ్ లిబరేషన్ ఆర్మీ, స్థావరాలపైనే తమ దాడి జరిగిందని పాక్ వివరించింది.

ఇదే విధంగా టెహ్రాన్ తమ డ్రోన్లు , క్షిపణలు, జైష్ అల్ అది (జెఎఎ ) గ్రూప్ మిలిటెంట్లపై దాడి చేశాయని వివరించింది. పాక్ లోని బెలోచిస్తాన్ నైరుతి ప్రావిన్స్ లోను, ఇరాన్ లోని సిస్టాన్ బెలోచిస్థాన్ ప్రావిన్స్ లోని ఈశాన్య ప్రాంతాల్లో ఈ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ రెండు ప్రాంతాలు అలజడులతో కూడినవే. ఖనిజ సంపద కలిగినవే. అయితే ఎలాంటి అభివృద్ధికి నోచని ప్రాంతాలుగా ఉంటున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ నేతృత్వంలో గురువారం ఇరాన్ ఉన్నత భద్రతా పాలక వర్గ సమావేశం జరిగింది. మిలిటెంట్లు భారీ ఎత్తున దాడులకు సంసిద్ధులవుతున్నందున ముందుగా మంగళవారం ఇరాన్ దాడులు సాగించిందని రైసీ వెల్లడించారని శుక్రవారం ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News