- Advertisement -
ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్ పరిణామాల పట్ల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సానుకూలంగా స్పందించారు. తాలిబన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకోవడం బానిస సంకెళ్లను తెంచుకోవడంలాంటిదే అన్నారు. ఇంగ్లీష్ బోధన, పాశ్చాత్య సంస్కృతిలాంటి వాటిపై ఖాన్ స్పందిస్తూ ఇతర దేశాల సంస్కృతులను అలవరచుకోవడం, వాటికి లోబడి ఉండటం బానిసత్వంకన్నా ఘోరమైనదన్నారు. శారీరక బానిసత్వంకన్నా మానసిక బానిసత్వం హీనమన్నారు. అలాంటి బానిస సంకెళ్లను తెంచడం కష్టం. అయినా దానిని వారు చేసి చూపించారంటూ తాలిబన్లను ఖాన్ ప్రశంసించారు. అణగిమణగి ఉండేవాళ్లు పెద్ద నిర్ణయాలు తీసుకోలేరని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. ఖాన్ వ్యాఖ్యలు తాలిబన్ల దూకుడు వెనుక పాక్ ప్రోత్సాహామున్నదన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి.
- Advertisement -