న్యూస్‌డెస్క్: సొంత సోదరీ సోదరుడి మధ్య లైంగిక సంబంధాలపై అభిప్రాయాలు చెప్పాలంటూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షా ప్రశ్నాపత్రంలో ప్రశ్నించిన పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌కు చెందిన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖైర్ అల్ బషర్‌ను యూనివర్సిటీ పాలక మండలి బర్తరఫ్ చేయడమేగాక బ్లాక్‌లిస్టులో పెట్టింది. కమ్‌సాట్స్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ బషర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్న తీవ్ర అభ్యంతరమని, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ కర్రికులమ్ చట్టాలకు పూర్తి విరుద్ధమని యూనివర్సిటీ అధికారి ఒకరు పంపిన లేఖ పేర్కొంది. విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీవ్ర మనస్థాపం కలిగింంచినట్లు లేఖలో పేర్కొన్నారు.
బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు డిసెంబర్ 4, 5 తేదీలలో జరిగిన పరీక్షలో ఈ వివాదాస్పద ప్రశ్న వచ్చింది. జనవరి 5వ తేదీన ప్రొఫెసర్ బషర్‌పై యూనివర్సిటీ చర్యలు తీసుకుంది. కాగా ఈ వ్యవహారంపై సోషల్ మీడియా అట్టుడికిపోయింది. ప్రొఫెసర్ బషర్ ఇచ్చిన అసభ్యకర ప్రశ్నపై నెటిజన్లు నిప్పులు చెరిగారు. ప్రశ్నాపత్రం స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. జూలీ, మార్క్ మధ్య జరిగిన సన్నివేశాన్ని చదివి దానిపై వ్యాసం రాయాలని విద్యార్థులకు ప్రశ్నాపత్రంలో అడిగారు. విద్యార్థులు 300 పదాలలో ఈ వ్యాసం రాయాలని, అంతేగాక విద్యార్థులు తమ వ్యాసంలో కారణాలను, అర్థవంతమైన ఉదాహరణలు కూడా చెప్పాలని ప్రశ్నాపత్రంలో పేర్కొన్నారు.
Stop dusting the filth under the carpet to protect the culprits. Is it enough to fire that moron who asked such a filthy question?Don’t the higher ups in the university know what’s going on? Or is the #comsatsuniversity owned by the teacher? Stop this nonsense rant #COMSATS pic.twitter.com/7GMBZ3ynTK
— Mishi khan (@mishilicious) February 20, 2023
We strongly condemns the vulgar content of the examination paper at #comsatsuniversity that has recently come to light
We thank @SenatorMushtaq & other senators for raising this matter in the Upper House. It is time out leaders stood up for the future generations of our nation! pic.twitter.com/v84ieUaeoO
— Islami Jamiat -e- Talaba (@JamiatPK) February 20, 2023
Immediate action took place like this.👏#comsatsuniversity pic.twitter.com/qhZKFOG5bo
— ayiesha kkay yusufzai (@AyieshaKhalid) February 20, 2023