Thursday, January 23, 2025

సీమాంతర ప్రేమ పెళ్లి సుఖాంతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇప్పుడు భారత్ తనదైందని పాకిస్థాన్‌కు చెందిన మహిళ సీమా హైదర్ సంతోషం వ్యక్తం చేసింది. యుపికి చెందిన సచిన్ మీనాతో పబ్‌జీ ద్వారా పరిచయం పెంచుకున్న హైదర్ తన నలుగురు పిల్లలతో కలిసి ఎటువంటి వీసా లేకుండా నేపాల్ మీదుగా ఇండియాకు చేరుకుంది. నలుగురు పిల్లల ఆమె , సచిన్ ప్రేమలో పడ్డారు. అంతకు ముందే పెళ్లి చేసుకున్నారు. అక్రమంగా వచ్చిన వీరికి ఆశ్రయం కల్పించిన సచిన్‌ను, అక్రమంగా వచ్చినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కాగా బెయిల్ రావడంతో ఇక్కడి జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత సీమా మాట్లాడుతూ తన భర్త హిందువు అని, ఇక తాను కూడా హిందువునే అని, ఈ భారత్ తనదే అని సంతోషం వ్యక్తం చేశారు. బోరున వర్షం కురుస్తూ ఉండగా ఆమె విలేకరులతో మాట్లాడారు.

వీరిరువురు నడుమ దేశాంతర ప్రేమకథ సినిమాను తలపించేలా ఉంది. కోవిడ్ దశలో వీరికి పబ్‌జీ గేమ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇది ఆన్‌లైన్ గేమ్‌ను మించి బలోపేతం అయింది. ఈ ఏడాది మార్చిలో వీరు నేపాల్‌లో పెళ్లిచేసుకున్నారు. చాలాకాలం కేవలం ఆన్‌లైన్ గేమ్ క్రమంలోనే ప్రేమించుకున్న తరువాత నేపాల్‌లో కలిసిన వెంటనే వీరి పెళ్లి జరిగింది. సచిన్‌ను కలుసుకునేందుకు తాను కరాచీ నుంచి ముందు దుబాయ్‌కు , అక్కడ 11 గంటలు గడిపి నేపాల్‌కు వచ్చినట్లు, తరువాత రోడ్డు మార్గం ద్వారా పోఖారాకు చేరుకున్నానని, అక్కడ సచిన్‌ను కలిశానని సీమా తెలిపింది. ఆ తరువాత ఆమె తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లింది. పాకిస్థాన్‌లో తన భర్తకు తాను విడిపోతున్నట్లు తెలిపి, అక్కడి తన ప్లాటును రూ 12 లక్షలకు అమ్మి విమాన టికెట్లు కొని నేపాల్‌కు నలుగురు పిల్లలతో కలిసి వచ్చింది.

మే నెలలో నేపాల్‌కు చేరిన తరువాత అక్కడ కొద్ది నెలలు ఉండి మేలోనే నోయిడా చేరుకుంది. సచిన్ అక్కడికి చేరుకుని పిల్లలతో పాటు ఆమెను ఓ ఇంట్లో ఉంచాడు ఆమె పాకిస్థానీ అనే విషయం తెలియచేయనివ్వలేదు. తరువాత తెలిసింది. అరెస్టు అయిన తరువాత ఆమె అధికారుల ముందు ఇక ఇండియాలోనే సచిన్‌తోనే ఉంటానని తెలిపింది. సంబంధిత పత్రాల పూర్తి పని అయితే ఇక తాను పూర్తి స్థాయిలో ఇండియాలో ఉండవచ్చునని తెలిపింది. ఇక తను ఆయన తన పిల్లలతో కలిసి కొత్త జీవితం ఆరంభిస్తానని సీమా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News