Monday, January 20, 2025

‘ఇండియా జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిన పాకిస్తానీయులు! ఎందుకో తెలుసా?

- Advertisement -
- Advertisement -

దాయాది దేశాలైన ఇండియా-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు దేశాల మధ్య వివాదాలు గత 75 ఏళ్లుగా రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు బాగోలేదు. ఆర్థికంగా చితికిపోయి అతలాకుతలమవుతోంది. అయినా, ఇండియాతో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదంటుంది. అయితే తాజాగా కొందరు పాకిస్తానీయులు ఇండియా జిందాబాద్ అంటూ నినాదాలు చేసి, అందరి దృష్టినీ ఆకర్షించారు. అది ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే!

శుక్రవారంనాడు అల్-కంబర్ అనే ఓ ఇరాన్ నౌకను తొమ్మిదిమంది సముద్రపు దొంగలు అరేబియా మహాసముద్రంలో హైజాక్ చేసి, తమ  అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన భారత నావికాదళం వెంటనే రంగంలోకి దిగి, 12 గంటల సేపు పోరాడి, సముద్రపు దొంగల ఆటకట్టించి, వారి చెరనుంచి ఇరాన్ నౌకను విడిపించింది. దొంగలను అదుపులోకి తీసుకుంది. ఆ కార్గో నౌకలో పాకిస్తాన్ కు చెందిన సుమారు 23మంది ఉన్నారు. తమను రక్షించిన భారత నావికాదళానికి కృతజ్ఞతలు తెలుపుతూ వారంతా ‘ఇండియా జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అదీ సంగతి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News