Sunday, January 19, 2025

పాకిస్థాన్ సాధన షురూ..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో ఆడే మ్యాచ్ కోసం పాకిస్థాన్ గురువారం సాధన ప్రారంభించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో శనివారం ఇరు జట్ల మధ్య పోరు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌కే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా మారిందనడంలో సందేహం లేదు. భారత్, పాకిస్థాన్ అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమీకులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

కాగా, ఇటు భారత్ అటు పాకిస్థాన్‌లు వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించారు. అహ్మదాబాద్‌లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. ఇక భారత్‌తో జరిగే మ్యాచ్ కోసం పాకిస్థాన్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. గురువారం కీలక ఆటగాళ్లందరూ ముమ్మర సాధన చేశారు. కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు రిజ్వాన్, సౌద్ షకిల్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫిక్, ఇఫ్తికార్ అహ్మద్ తదితరులు బ్యాటింగ్‌పై దృష్టి పెట్టారు. షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్, ఇఫ్తికార్, నవాజ్, హసన్ అలీ తదితరులు బౌలింగ్ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. కాగా, అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడు పోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News