Thursday, January 23, 2025

పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ

- Advertisement -
- Advertisement -

Pakka Commercial Movie Unit Press Meet

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్‘ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన కార్యాక్రమంలో హీరో గోపిచంద్, హీరోయిన్ రాశీఖన్నా, దర్శకుడు మారుతి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసుతో పాటు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. “ఈ సినిమా ప్రారంభం కావడానికి మొదటి కారణం యు.వి క్రియేషన్స్ వంశీ. నా నుంచి ఎటువంటి కామెడీ ఆశిస్తారో… దాంతో పాటు అన్ని మిక్స్ చేసి తీసిన కమర్షియల్ సినిమాలా ఈ మూవీ ఉంటుంది”అని అన్నారు. “పక్కా కమర్షియల్ సినిమా ఓటిటిలో అంత త్వరగా రాదు. ఎఫ్ 3 సినిమా ప్రస్తుతం బాగా ఆడుతుంది. దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా కూడా ఉండబోతుంది” అని అల్లు అరవింద్ చెప్పారు. గోపిచంద్ మాట్లాడుతూ.. “కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేసేద్దామని నిర్ణయించుకున్నాను. మారుతితో నాకు వేవ్ లెంగ్త్ బాగా కుదిరింది. ఒక పాజిటివ్ పీపుల్ కలిసి సినిమా చేసినప్పుడు దాని రిజల్ట్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ పక్కా కమర్షియల్ మూవీ” అని తెలిపారు.

Pakka Commercial Movie Unit Press Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News