- Advertisement -
ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణ కింద భారత రిటైర్డ్ నావికాధికారి కుల్‌భూషణ్ జాదవ్(51)కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం పాక్ జైలులో నిర్బంధంలో ఉన్నాడు. అయితే అతడు తన శిక్షపై రీఅప్పీల్ చేసుకునేందుకు వీలుగా పాకిస్థాన్ పార్లమెంటు బుధవారం జాయింట్ సిట్టింగ్‌లో చట్టాన్ని చేసింది. దీంతో అతడు మిలిటరీ కోర్టు విధించిన శిక్షపై రివ్యూ అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు. ఇదివరలో అంతర్జాతీయ కోర్టు వరకు అతడి విషయం వెళ్లింది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ, సెనేట్ మధ్య అభిప్రాయభేదాలు రాజీకి రాబోయేసరికి ఈ జాయింట్ సిటింగ్ కూర్చున్నారు.
- Advertisement -