మన తెలంగాణ/షాద్‌నగర్: బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి చేసిం దేమి లేదని, అందినకాడికి దొచుకోవడమే పనిగా పెట్టుకున్నారని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్న య్య ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. జాతీ య జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుండి అందిన కాడికి దోచుకొవడమే బిఆర్‌ఎస్ ప్రభుత్వం పని గా పెట్టుకుందని వాపోయారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహ త్యలు చేసుకుంటుంటే పంజాబ్‌లోని రైతులకు పరిహారం ఇచ్చేందుకు ముఖ్య మంత్రి కెసిఆర్ వెల్లడం ఎమిటని విమర్శించారు.
టిఆర్‌ఎస్, బిజెపిలు ఒక్కటై ప్రలజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికా రం లోని వచ్చిన తరువాత ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామని పేర్కొ న్నారు. కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ద్ధమవు తున్నా యని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ వై.యాద య్య యాదవ్, టిపిసిసి సభ్యుడు బాబ ర్‌ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్ రాజ్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్‌రెడ్డి, జిల్లేడు చౌదరి గూడ మండల అధ్యక్షుడు చలివేంద్రంపల్లి రాజు, సింగిల్ విండో డైరెక్టర్ అంజి యాదవ్, ఫరూఖ్‌నగర్ మండల ఉపాధ్యక్షుడు సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు కొం కళ్ళ చెన్నయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్జున్ లక్ష్మణ్, లిం గారెడ్డి గూడ ఆశోక్, అందె శ్రీకాంత్, బచ్చలి చిన్న నర్సింహ్మలు పాల్గొన్నారు.