Thursday, January 23, 2025

పాలడుగు నైట్‌హాల్ట్ బస్సును పునరుద్ధరించాలి

- Advertisement -
- Advertisement -

Paladugu to Hyderabad bus

మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి సుమారు 15 ఏళ్లుగా నడుస్తున్న నైట్ హాల్ట్ బస్సును పునరుద్ధరించాలని బిఎస్ పి నియోజకవర్గ అధ్యక్షుడు కె.బాలరాజు కోరారు. బస్సును పునరుద్ధరించేలా ఆర్టిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ గురువారం పాలడుగు గ్రామ సర్పంచ్ మరిపెల్లి యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోత్కూరు నుంచి పాలడుగు గ్రామానికి నైట్ హాల్ట్ బస్సు నడిచేదని, ఉదయం 4 గంటలకు బస్సు గ్రామం నుంచి బయల్దేరి మోత్కూరు మీదుగా హైదరాబాద్ వెళ్లేదని, ఆ బస్సుతో నర్సాపురం, రాఘవాపురం, దుప్పల్లి, చింతలచర్ల, ఎర్రకాల్వ తదితర గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేదన్నారు. ఆర్టిసి యాదగిరిగుట్ట డిపో అధికారులకు విన్నవించినప్పటికి పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే పాలడుగు గ్రామానికి బస్సును పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్, కొంపెల్లి రాజు, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News