- Advertisement -
పాలకుర్తి : తొర్రూరు మండల శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కుల రాంరెడ్డి గులాబీ గూటికి చేరాడు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బిఆర్ ఎస్‌లో చేరారు. రామ్‌రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, లక్ష్యాలకు భిన్నంగా పనిచేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.
రెడ్డి సామాజిక వర్గానికి కూడా తీరని అన్యాయం చేస్తున్నారు. కష్ట కాలంలో పార్టీని నిలబెడుతూ ఈ రోజు వరకు కష్టపడి పని చేస్తున్న నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆమె వ్యవహార శైలి ఆ పార్టీకి తీరని నష్టం చేసే విధంగా ఉందన్నారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.
- Advertisement -