Sunday, December 22, 2024

ఏదుల పంప్‌హౌస్ రెడీ

- Advertisement -
త్వరలో ఏదుల పంప్‌హౌస్ డ్రైరన్
హైదరాబాద్:  కృష్ణానదీ జలాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాక్షికంగా ఫలితాలు అందజేసేందుకు సిద్దమవుతోంది. ఈ పథకంలో భాగంగా ఏదుల పంపుహౌస్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ పంప్‌హౌస్ డ్రై రన్ నిర్వహించనున్నారు. ఏదుల పంపింగ్ స్టేషన్ వద్దగల 400 కిలోవాట్ల విద్యుత్‌ఖ స్టేషన్ చార్జ్ చేశారు.దీంతో పాటు డిండి 400కేవి సబ్ స్టేషన్ నుంచి ఏదుల పంపింగ్ స్టేషన్ వరకూ నిర్మించిన 60కిలోవాట్ల ట్రాన్స్‌మిషన్ లైన్లను కూడా చార్జి చేశారు. దీంతో ఏదుల పంపింగ్ స్టేషన్ డ్రై రన్‌కు మార్గం సగమం అయింది. దీంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకఘట్టానికి రంగం సిద్దమయింది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో ఇటీవల వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ ఏదుల పంపింగ్ స్టేషన్ ను సందర్శించి జులై ఆఖరు నాటికి నీరందించేలా ఏదుల పంపులు సిద్దం చేయాలని ఆదేశించారు. ఇందులో బాగంగా శుక్రవారం ఏదుల పంపింగ్ స్టేషన్ దగ్గర నిర్మించిన 400 కె.వి సబ్ స్టేషన్ ను ఛార్జి చేయటం జరిగింది. దీంతో పాటు డిండి 400కె.వి సబ్ స్టేషన్ నుంచి ఏదుల పంపింగ్ స్టేషన్ వరకు నిర్మించిన 60 కిలో మీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్ ను కూడ చార్జి చేయటం జరిగింది.
ఏదుల పంపింగ్ స్టేషన్ పంపులను నడపటానికి అవసరమైన అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఏదుల పంప్ హౌస్ లో పంప్ ల డ్రై రన్ నిర్వహిస్తామని నీటి పారుదల శాఖ సి.ఇ హమీద్ ఖాన్ వెల్లడించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫోన్‌లో ఇంజనీరింగ్ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో సీఈ శ్రీరాం నాయక్, సీఈ లతా వినోద్, ఎస్‌ఈలు విజయ బాస్కర్ రెడ్డి, మానిక్య రావు, ఈఈలు రాము, రవీందర్, , మహేందర్ రెడ్డి, హరి ప్రసాద్, డీఈలు సత్యనారాయణ గౌడ్, దశరథ్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News