Wednesday, January 22, 2025

ప్రత్యేక రాష్ట్రంలో పాలమూరుకు ఎక్కువ నష్టం జరిగింది: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం కంటే ప్రత్యేక రాష్ట్రంలో పాలమూరుకు ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పాలమూరు జిల్లా ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఏం పాపం చేశారని అడిగారు. 2009లో పాలమూరులో పోటీ చేస్తే మహబూబ్‌నగర్ ప్రజలు భుజాన పెట్టుకొని గెలిపించారని గుర్తు చేశారు.  బడ్జెట్ పై చర్చ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. రూ.20 లక్షల కోట్లు ఖర్చు చేసినా పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేసి సిగ్గులేకుండా ఎలా మాట్లాడుతున్నారని బిఆర్‌ఎస్ నాయకులపై మండిపడ్డారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, కెసిఆర్ కిట్లపై విచారణకు సిద్ధమా? అని రేవంత్ సవాల్ విసిరారు.

ఇప్పుడు కూడా బిఆర్‌ఎస్ నాయకులు ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతే జరిగిందని, గొర్రెల స్కామ్, బతుకమ్మ చీరల్లోనూ అవినీతే బయటపడిందని విమర్శలు గుప్పించారు. సూరత్ నుంచి నాసిరకం చీరలు తెచ్చి పంచారని, గొల్లకురుమల పేరుతో వందల కోట్లు కొల్లగొట్టారని, ఇలాంటి తప్పుడు లెక్కలు చెబితేనే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు గుండా సున్నా వచ్చిందని చురకలంటించారు. రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల భూములు బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమ్మిందని, కట్టడాల లెక్కలు హరీష్ రావు చెబుతున్నారని, అమ్మిన లెక్కలు ఎందుకు చెప్పడం లేదని రేవంత్ అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News