Monday, December 23, 2024

ట్రెండింగ్‌లో పాలమూరు ప్రాజెక్టు టాప్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు -రంగారెడ్డి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయస్థాయి సోషల్ మీడియాలో మార్మోగుతోంది. శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రొఫైల్‌పై సోషల్ మీడియా ట్విట్టర్ (ఎక్స్)లో ట్రెండింగ్‌గా మారింది. శనివారం సాయంత్రం 6గంటల సమయంలో ట్విట్టర్ ట్రెండింగ్‌లో దేశంలోనే పాలమూరు-రంగారెడ్డి లిఫ్టు ప్రాజెక్టు అగ్రస్థానంలో నిలిచింది. ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఏకంగా 7049 పోస్టులు వచ్చాయి. అదే సమయంలో 1888 పోస్టులతో జమ్ము యూత్ కాంక్లేవ్ ట్రెండింగ్‌లో రెండోస్థానంలో నిలిచింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్ధాల కాలం పాటు ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు బాధలు అరిగోసను అనుభవించినయన్నారు. ఒకప్పుడు సుసంపన్నంగా వర్థిల్లుతూ ఎంతో చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని సొం తం చేసుకున్న పాలమూరు లో గంజి కేంద్రాలను నడిపించిన దుస్థితి నాటి ఉమ్మడి ఎపి పాలకులదని, నాటి వలస పాలనలో పాలమూరులో ఎటుచూసినా వలసలే తాండవించేవని పాలమూరు అంటే దేశంలోనే వలస లేబర్‌కు పేరుగాంచిన దుస్తితి ఉండేదని& ఆ పరిస్థితుల్లో భారీ మార్పులు చేసి పాలమూరు జిల్లానే కాకుండా దక్షిణ తెలంగాణ ప్రాంతాన్నే సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకొన్న సిఎం కెసిఆర్ సా ధించిన ఘ నతకు ప్రతిరూపమే పాలమూరు- రంగారెడ్డి లిఫ్టు ప్రాజెక్టు అని జాతీయస్థాయిలో మీడి యా కథనాలను చదవిన పాఠకులు ట్విట్టర్ ట్రెండింగ్‌లో భారీ సంఖ్యలో స్పందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News