Monday, January 20, 2025

కర్నాటక ప్రాజెక్టులకు జాతీయ హోదా, పాలమూరుకేది?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

మహబూబ్ నగర్: దేవరకద్ర నియోజకవర్గంలో రూ.119 కోట్ల పనులకు శంకుస్థాపన చేశామని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు.  దేవరకద్ర నియోజకవర్గంలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. భూత్పూర్ మండలం పోతలమడుగు దగ్గర మినీ స్టేడియానికి. అడ్డాకుల మండలం గుడిబండ గ్రామ బిటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. భూత్పూర్ లో వెజ్-నాన్ వెజ్ మార్కెట్ కు, వెంకంపల్లి దగ్గర లిఫ్ట్ పనులు, వర్నె-ముత్యాలపల్లి హైలెవర్ బ్రిడ్జి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సిఎం కెసిఆర్ కృషితో బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కే పరిస్థితి లేదని మహిళలే చెబుతున్నారని ప్రశంసించారు.

ఇంటింటికీ తాగు నీరు ఇయ్యాలన్నా ఆలోచన ఎవరికైనా వచ్చిందా? గత పాలకులను కడిగిపారేశారు. సిఎం కెసిఆర్ పేదింటి ఆడబిడ్డలకు మేనమామలాగా ఆర్థిక సాయం చేస్తున్నారని, పేదింటి ఆడబిడ్డలకు రూ.లక్షా 116లు ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? అడిగారు. రూ.200 ఉన్న వృద్ధాప్యం పెన్షన్ రూ.2 వేల చేసింది కెసిఆరేనని చెప్పారు. జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నామని, పేదవాడి ముఖంలో చిరునవ్వు చేసే ప్రభుత్వం కెసిఆర్ దేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోవాలన్నారు.

పాలమూరు ప్రాజెక్టుకు కొందరు కేసులు వేసి అడ్డుకున్నారని, గతంలో పాలమూరు ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ, దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రం కర్నాటక ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారని, పాలమూరు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సిగ్గులేకుండా బిజెపోళ్లు పాదయాత్రలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. ఎనిమిదేళ్లుగా కృష్ణా జలాల వాటా తెల్చాలని మోడీ ప్రభుత్వాన్ని అడుగుతున్నామని, కానీ ఇప్పటి వరకు తేల్చలేదని మండిపడ్డారు.  భూత్పూర్ మున్సిపాలిటీ సిద్దాయపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.  ఆ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్ఎలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News