హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాలవి దుష్ప్రచారం సరికాదని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు విశ్వప్రయత్నాలు చేశాయని దుయ్యబట్టారు. ప్రాజెక్టును జూరాల నుంచి మొదలు పెట్టాలని మొదట విపక్షాలు వాదించాయని, అటవీ ప్రాంతంలో ప్రాజెక్టును నిర్మిస్తున్నామని విపక్షాలు ఫిర్యాదు చేశాయని, విపక్షాలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయని, చిరకు గ్రీన్ ట్రైబ్యునల్‌లో సైతం విపక్షాలు ఫిర్యాదు చేశాయని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. అన్ని విఘ్నాలు దాటుకుని ప్రాజెక్టును ప్రారంభించుకున్నామని, ప్రాజెక్టు రీడిజైన్‌తో ముంపు ప్రాంతాల పరిధి తగ్గిందని దుయ్యబట్టారు. తక్కువ ముంపుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా సిఎం కెసిఆర్ దృష్టి పెట్టారని నిరంజన్ రెడ్డి కొనియాడారు.
Also Read: ఎన్నికల సన్నాహక సమావేశంలో మోట కొండూరు తహశీల్దార్ కు గుండెపోటు