Monday, December 23, 2024

సర్జిపూల్‌లోకి నీటి విడుదల

- Advertisement -
- Advertisement -

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో మరో ముందడుగు వెట్ రన్ ట్రయల్స్‌కు సన్నాహాలు

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మంగళవారం మరో ముందడుగు పడింది. అప్రోచ్ ఛాన ల్ ద్వారా శ్రీశైలం తిరుగు జలాలను హెడ్ రెగ్యులేటర్ గేటును ఎత్తి దిగ్విజయంగా సర్జిపూల్‌లోకి నీ టిని విడుదల చేశారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ డీఈలు, ఈఈల పర్యవేక్షణలో నీటిని వి డుదల చేసి టెక్నికల్ అంశాలను పరిశీలించారు.

సాయంత్రం 5.10 నిమిషాలకు కృష్ణా జలాలకు పూజలు నిర్వహించి నీటిని సర్జిపూల్‌లోకి వదిలే ప్రక్రియను ప్రారంభించారు. టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ లీకేజీలు ఇతరత్రా అం శాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ హెచ్చుతగ్గుల మధ్య నీటిని సర్జిపూల్‌లోకి వదులుతున్నారు. ఒక మోటారుకు అవసరమైన నీటిని స్టోర్ చేసిన తర్వాత ఒక టి, రెండ్రోజుల్లో వెట్న్‌న్రు ప్రారంభించి పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియను ఇంజినీరింగ్ అధికారులు, తాగునీటి రంగ నిపుణుల పర్యవేక్షణలో ని ర్వహిస్తున్నారు. సర్జిపూల్‌లోకి నీటిని వదిలే ప్రక్రి య దిగ్విజయంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News