Friday, December 20, 2024

త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రారంభానికి సిద్ధం

- Advertisement -
- Advertisement -

ప్రాజెక్టు పనులు 85శాతం పూర్తి
నెలాఖరున మొదటి పంపు ద్వారా నీటి తోడిపోత : మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్ :  త్వరలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి పధకాన్ని ప్రారంభానికి సిద్దం చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.శుక్రవారం మంత్రి మీడియాకు పాలమూరురంగారెడ్డి పధకం పనుల తీరును వివరించారు.ఈ పథకానికి పర్యావరణ అనుమతులు వచ్చాయ తొలిసారి మంత్రి మాట్లాడుతూ ఇది తెలంగాణ విజయం అన్నారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ల మీద సంబరాలు నిర్వహించాలన్నారు.రైతన్నలతో కలిసి సంతోషాన్ని పంచుకోవాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల వద్ద వేలాది మంది రైతులతో కార్యక్రమాలకు పిలుపు నిచ్చారు.

పాలమూరు కష్టాలు తీర్చిన కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయం అని , కాళేశ్వరం పంపులను మించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు ఉన్నాయన్నారు. కాళేశ్వరం పంపుల సామర్థ్యం 139 మొగావాట్లు కాగా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపుల సామర్థ్యం 145 మెగావాట్లు, ఒక మోటరు ఒక లక్ష 96,500 హార్స్ పవర్ ఉందని తెలిపారు. రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే విధంగా పనులు జరుగుతున్నాయన్నారు. నార్లాపూర్ అంజనగిరి రిజర్వాయర్ వద్ద 145 మొగావాట్ల సామర్థ్యం గల 10 పంపులు, రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 11 కిలోమీటర్లు, ఎత్తు 60 మీటర్లు, 6.5 టీఎంసీల సామర్థ్యం ఉందని వెల్లడించారు. త్వరలో డ్రై రన్ కు సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ నెలాఖరుకు మొదటి పంపు ప్రారంభం అవుతుందని తెలిపారు. తెలంగాణలో అత్యంత ఎత్తయిన రిజర్వాయర్ ఇదె అని, ఇప్పటికే 85 శాతం పనులు పూర్తి అయినట్టు తెలిపారు. ఏదుల వీరాంజనేయ ఆనకట్ట పొడవు 7.5 కిలోమీటర్లు, 6.55 టీఎంసీల సామర్థ్యం ఉందన్నారు. 145 మెగావాట్ల సామర్థ్యం గల 10 పంపుల ఏదుల పంప్ హౌస్ నిర్మించినట్టు తెలిపారు.24 నెలల రికార్డు సమయంలో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం పైర్తయిందన్నారు. 1299 మంది ముంపు బాధితులను గుర్తించి రూ.205 కోట్ల పరిహారం అందజేసినట్టు తెలిపారు.

ఈ ప్రాజెక్టు ద్వారా 50 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుందన్నారు. వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 15.23 కిలోమీటర్లు, లక్ష 39 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. 145 మెగావాట్ల సామర్థ్యం గల 10 పంపులతో వట్టెం పంప్ హౌస్ నిర్మించినట్టు తెలిపారు. కరివెన కురుమూర్తి రాయ రిజర్వాయర్ సామర్థ్యం 19 టీఎంసీలు అని, ఆనకట్ట పొడవు 15 కిలోమీటర్లు కాగా, లక్ష 50 వేల ఆయకట్టుకు సాగునీరు అందనుందని , ఇందుకోసం కాలువ పొడవు 110 కిలోమీటర్లు మేరకు నిర్మించినట్టు తెలిపారు.ఉదండాపూర్ రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 15.8 కిలోమీటర్లు కాగా, 16.03 టీఎంసీల సామర్థ్యం ఉందని, 9.36 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో జిల్లా సస్యశ్యామలం కానుందన్నారు.కేసీఆర్ సంకల్ప బలమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి కారణం అని వెల్లడించారు. రాబోయే పదేళ్లలో పాలమూరు కోనసీమను మరిపిస్తుందన్నారు. హైదరాబాద్ నుండి అలంపూరు వరకు దారి పొడవునా పచ్చదనం పరుచుకుంటుందన్నారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల విజయోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి ప్రజలకు పిలపునిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News