Friday, November 22, 2024

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ప్రారంభించారు. నార్లాపూర్‌ తొలి పంపు స్విచ్‌ ఆన్‌ చేసిన కేసీఆర్‌.. పాలమూరు-రంగారెడ్డి పైలాన్‌ ఆవిష్కరించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 6 రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. శ్రీశైలం వెనుక జలాల నుంచి మోటార్లతో నీటి ఎత్తిపోతలు చేపట్టనున్నారు. 60 రోజుల్లో 90 టిఎంసిలు ఎత్తిపోసేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. పాలమూరు-రంగారెడ్డి 1226 గ్రామాలకు తాగునీరు ఇచ్చేలా నిర్మాణం చేపట్టారు. ఎత్తిపోతల కోసం 145 మెగా వాట్ల సామర్థ్యం గల 31 భారీ పంపులు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News