Monday, December 23, 2024

మేఘా నిర్లక్షం!.. నీట మునిగిన వట్టెం పంప్‌హౌస్

- Advertisement -
- Advertisement -

మూడు భారీ మోటార్లు మునక టన్నెల్‌లో 24 కి.మీ. మేర వరద
పాలమూరు-రంగారెడ్డి పనులకు తీవ్ర ఆటంకం. నీరు తోడేందుకే 2 నెలలు పట్టే అవకాశం 
నెలరోజుల్లో పునరుద్ధరిస్తాం : ఎస్‌ఇ

మన తెలంగాణ/హైదరాబాద్/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథ కం మోటార్లు వరద పాలయ్యాయి. నిర్మాణ సం స్థ మేఘా కంపెనీ నిర్లక్షమే దీనికి కారణమని ఆ రోపణలు వస్తున్నాయి. ప్యాకేజీ 7, 8లలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ పంపుహౌస్‌లోకి వరద నీరు చేరడంతో పంపుహౌస్‌లో మూడు మోటార్లు ము నిగిపోయాయి. 24 కిలోమీటర్ల మేర భూగర్భ ట న్నెల్‌లో నీరు చేరింది. ఇందుకు సంబంధించిన వి వరాలు ఇలా ఉన్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 14.9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం న మోదైంది.

నాగర్‌కర్నూల్ మండలం, శ్రీపురం గ్రా మ సమీపంలో నాగనూలు గ్రామ చెరువుకు దగ్గరలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా వాహనాలు వెళ్లేందుకు ఏర్పాటు చే సిన టన్నెల్ ద్వారం చెరువుకు సమాంతరంగా ఉండడమే ముంపునకు కారణంగా చెప్పవచ్చు. నాగనూలు చెరువుకు ఎగువ నుండి సుమారు 30చెరువులు, కుంటల ద్వారా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలకు అన్ని చెరువులు, కుం టలు అలుగు పారడంతో నాగనూలు చెరువులో గత నెల 31వ తేదీ రాత్రి చెరువు నిండి టన్నెల్‌లో కి నీరు క్రమక్రమంగా ప్రవహించింది. భారీగా వ రద రావడంతో టన్నెల్‌లోకి నీరు పెద్ద ఎత్తున చే రింది. గత మూడు రోజులుగా ప్యాకేజీ 7, 8లకు సంబంధించిన మెగా హెచ్‌ఈసి కంపెనీ ఇంజినీర్లు, అధికారులు నీటిని దారి మళ్లించే ప్రయ త్నం చేసినా భారీ వరదతో సాధ్యం కాలేదు.

70 శాతం పనులు పూర్తయినా…
పాలమూరురంగారెడ్డ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడవ ఎత్తిపోతల పథకమైన వట్టెం వెంకటాద్రి పంపుహౌస్ పనులు 70 శాతం పూర్తయ్యాయి. మొత్తం మూడు మోటార్ల పనులు 70 శాతానికి పైగా పూర్తి కావడంతో సంబంధిత కాం ట్రాక్టు కంపెనీ వారు ఈ ఏడాది నవంబర్‌లో 3 మోటార్లకు డ్రైరన్‌కు లక్షంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇదేక్రమంలో భారీ వర్షాలు రావడం వరద నీరు టన్నెల్‌లో చేరడంతో ప్రాజెక్టు పనులు మందగించే అవకాశాలు ఉన్నాయి. పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా 7, 8 ప్యాకేజీలలో సాతాపూర్ నుంచి వట్టెం రిజర్వాయర్ వరకు 24 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం పూర్తైంది. ఇందులో 12 కిలోమీటర్లు సిమెంట్ లైనింగ్ వర్క్ కూడా పూర్తైంది. ప్రస్తుతం 24 కిలోమీటర్ల మేర టన్నెల్ మొత్తం నిండుకుంది. ఈ నీటిని తోడడానికి సుమారు 2 నెలల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తోంది. 12 కిలోమీటర్ల మేర కేవలం తవ్వకం పనే పూర్తైంది. సిమెంట్ లైనింగ్ కాకపోవడంతో వర్షపు నీరు చేరడం వల్ల సొరంగం కూలితే భారీ నష్టంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా వట్టెం పంపుహౌస్ వరద నీటిలో మునిగిపోయిందని నెల రోజుల్లో నీటిని తోడి పనులను పునరుద్ధరిస్తామని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చీఫ్ ఇంజనీర్ పార్థసారధి రెడ్డి విలేకరులకు తెలిపారు. 7, 8 ప్యాకేజీ పనులను మెగా కంపెనీతో పాటు హెచ్‌ఈసి కంపెనీలు చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్యాకేజీల కింద రూ.2100 కోట్ల విలువైన పనులు ఈ కంపెనీలు చేస్తున్నాయని అన్నారు. వట్టెం పంపుహౌస్‌లో మూడు మోటార్లు మునిగిపోయాయని తెలిపారు. ఉద్దండాపూర్‌లో 30 శాతం పనులు పూర్తయ్యాయని లక్ష్మిదేవిపల్లి వద్ద ఇంకా పనులు ప్రారంభం కాలేదని అన్నారు. కాంట్రాక్టు పొందిన కంపెనీలు ప్రభుత్వానికి ప్రాజెక్టును పూర్తి చేసి అందించే వరకు వారిదే బాధ్యత ఉంటుందని, ప్రభుత్వానికి ప్రజలకు ఎలాంటి భారం కాబోదని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News